Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ వారం ఓటీటీ సినిమాలు .. సిరీస్ లు ఇవే!

 OTT movie in this week
Advertisement
  • ఈ నెల 5న నెట్ ఫ్లిక్స్ లో టబూ 'ఖుఫియా' స్ట్రీమింగ్ 
  • అదే రోజున అందుబాటులోకి మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి
  • 6వ తేదీన హాట్ స్టార్ లో 'లోకి' .. అమెజాన్ ప్రైమ్ లో 'ముంబై డైరీస్'
  • అదే రోజున జీ 5లో 'గదర్ 2' .. 8 నుంచి  నెట్ ఫ్లిక్స్ లో 'OMG'

Advertisement
ఈ వారం ఓటీటీ సెంటర్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు .. సిరీస్ లే అడుగు పెడుతున్నాయి. 'నెట్ ఫ్లిక్స్' లో ఈ నెల 5వ తేదీ నుంచి ' మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' స్ట్రీమింగ్ కానుంది. వంశీకృష్ణ - ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాలో, అనుష్క - నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ లో 'ఖుఫియా' అందుబాటులోకి రానుంది. టబూ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ ఇది. ఇక అక్టోబర్ 6వ తేదీన 'ఆహా'లో 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. సోహెల్ - రూప జంటగా నటించిన ఈ సినిమా, థియేటర్స్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఇక అదే రోజున 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' సిరీస్ 'ఆహా' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 6వ తేదీ నుంచి హాట్ స్టార్ లో 'లోకి' వెబ్ సిరీస్ .. అమెజాన్ ప్రైమ్ లో 'ముంబై డైరీస్' అందుబాటులోకి రానున్నాయి. అదే రోజున జీ5లో 'గదర్ 2' స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 8వ తేదీన అక్షయ్ కుమార్ 'OMG' నెట్ ఫ్లిక్స్ ద్వారా పలకరించనుంది.
Advertisement
Advertisement
Tabu
Anushka Shetty
Hebba Patel
Akshay Kumar

More Telugu News